బీజింగ్, మే 7: జన్యు సవరణ పంటలకు చైనా ఆమోదం తెలిపింది. చైనాకు చెందిన షెన్‌డాంగ్ షున్ఫెంగ్ కంపెనీ జన్యు సవరణ సోయాబీన్ పంటకు అనుమతులు పొందింది. ఐదేండ్లకుగానూ అనుమతులు పొందిన ఈ కంపెనీ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఈ సోయాబీన్లో రెండు రకాల జన్యువులు ఉంటాయి. ఇవి కొవ్వు పదార్థమైన ఒలెయిక్ యాసిడ్‌ను మొక్కకు అందించి ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
ఇప్పటికే అధిక దిగుబడి ఇచ్చే వరి, జొన్న, మక్కజొన్న, విటమిన్-సీ అధికంగా ఉండే పాలకూర తదితర 20 రకాల పంటలపై ఈ కంపెనీ పరిశోధనలు చేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి చైనా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. చైనాలోని మధ్య తరగతి సరైన తిండికి నోచుకోవటం లేదు. ఈ పంట ద్వారా ఆహార సంక్షోభం నుంచి కొంతమేరకైనా బయటపడొచ్చని చైనా భావిస్తున్నది.