బీజింగ్: భూపొరల లోతుల్లోకి చైనా డ్రిల్లింగ్(China Drilling) మొదలుపెట్టింది. దాదాపు పది వేల మీటర్ల లోతుకు అంటే.. సుమారు 33 వేల ఫీట్ల లోతుకు రంధ్రాన్ని చేయనున్నది. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఈ డ్రిల్లింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. చైనా చేస్తున్న డ్రిల్లింగ్ పని.. దాదాపు పది ఖండాల భూభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లగలదు. భూభాగంలోని క్రేటేసియస్ పొరను ఆ హోల్ చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడ సుమారు 145 మిలియన్ల క్రితం ఏర్పడిన రాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
భూగర్భ పరిశోధనలు ఉదృతం చేయాలని ప్రఖ్యాత సైంటిస్టులను ఉద్దేశిస్తూ ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఖనిజాలతో పాటు వనరుల్ని కూడా గుర్తించాలని ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకు బోర్హోల్లో అతి పెద్ద రంధ్రాన్ని రష్యా తొవ్వింది. కోలా సూపర్డీప్ బోర్హోల్ దాదాపు 12 వేల మీటర్ల లోతు ఉంటుంది. అంటే అది దాదాపు 40వేల ఫీట్ల లోతు అన్నమాట. 1989లో ఆ హోల్ చేశారు. దాన్ని డ్రిల్ చేసేందుకు 20 ఏళ్లు సమయం పట్టింది.
Read More..
Air New Zealand | లగేజీ బరువే కాదు, ఇక ప్రయాణికుల బరువూ చెక్ చేస్తాం: ఎయిర్ న్యూజిలాండ్