Spy Satellite: నార్త్ కొరియా స్పై శాటిలైట్ ప్రయోగం విఫలం
Spy Satellite: ఉత్తర కొరియా ఇవాళ చేపట్టిన మిలిటరీ ఉపగ్రహ పరీక్ష విఫలమైంది. రాకెట్ మధ్యలో పేలిపోవడంతో.. నిఘా శాటిలైట్ ధ్వంసమైంది. అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టాలనుకున్న ఉత్తర కొరియా ప్లాన్‌కు విఘాతం ఎదురైంది.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా చేపట్టిన తొలి అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఆ స్పై శాటిలైట్(Spy Satellite) సముద్రంలో కూలింది. మిలిటరీ ఉపగ్రహం మార్గమధ్యంలో పేలినట్లు ఉత్తర కొరియా తెలిపింది. చియోల్లిమా-1(Cheollima-1) రాకెట్ ద్వారా ఆ శాటిలైట్‌ను ప్రయోగించారు. అయితే అది కొరియా పశ్చిమ సముద్రంలో కూలినట్లు తెలుస్తోంది. టూ స్టేజ్ ఇంజిన్‌కు చెందిన ఆ రాకెట్.. స్టార్టప్ సరిగా తీసుకోలేదు. ఫియాన్గాన్ ప్రావిన్సులో ఉన్న సోమే శాటిలైట్ లాంచింగ్ గ్రౌండ్ నుంచి మల్లిగ్యాంగ్-1( Malligyong-1) శాటిలైట్‌ను ప్రయోగించారు.
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11వ తేదీ లోగా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇటీవల ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే ఆ ప్రయోగం విఫలం కావడంతో.. త్వరలోనే రెండో లాంచ్ చేపట్టనున్నట్లు ఆ దేశం తెలిపింది.
స్పై శాటిలైట్ ప్రయోగం విఫలం కావడంతో.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఇక జపాన్ కూడా ఒకినావా ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. సియోల్‌లో ఎయిర్ రెయిడ్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తరలింపునకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు మెసేజ్‌లు వెళ్లాయి. అయితే మరో 20 నిమిషాల తర్వాత ఆ మెసేజ్ అవాస్తవం అని తేలింది.
Read More..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

