న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా ఓ ఐదు అంశాల ప్రణాళికను ప్రతిపాదించాయి.
తక్షణమే ఘర్షణలను నిలిపివేయడం, శాంతి చర్చలను త్వరగా ప్రారంభించడం, పౌర, సైనికేతర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించడం, హొర్ముజ్ జలసంధిలో నౌకాయాన మార్గాలను సురక్షితం చేయడం, ఐక్యరాజ్యసమితి చార్టర్ కింద ఒక సమగ్ర శాంతి చట్రాన్ని నిర్మించడం వంటివి చైనా, పాక్ ప్రతిపాదించిన ప్రణాళికలోని అంశాలు.