డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ నెల 30 నుంచి, కేదార్‌నాథ్‌ను వచ్చే నెల 2 నుంచి, బద్రీనాథ్‌ను వచ్చే నెల 4 నుంచి భక్తుల కోసం తెరుస్తారు.
భక్తులు ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోవచ్చు. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్త కాశి, సోన్‌ప్రయాగ్ తదితర నగరాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా భక్తులు నమోదు చేయించుకోవచ్చు.