Woman Passenger | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు (Woman Passenger) ఫ్లైట్‌లో గందరగోళం సృష్టించింది. తన చేష్టలతో తోటి ప్రయాణికులను (passengers) భయబ్రాంతులకు గురిచేసింది.
సోమవారం మధ్యాహ్నం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ (Houston) నుంచి ఫీనిక్స్ (Phoenix) బయల్దేరింది. విమానం హూస్టన్‌లోని విలియం పి హాబీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేసింది. తన దుస్తులు వదిలేసి ఫ్లైట్‌లో పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించింది (stripped naked). కాక్‌పిట్ తలుపును (cockpit door) కొడుతూ.. తనను విమానం నుంచి కిందకు దించేయండి అంటూ బిగ్గరగా అరిచింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఇలానే ప్రవర్తించింది.
ఆమె వింత ప్రవర్తనకు ఫ్లైట్‌లోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆమె ప్రవర్తనతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే సదరు మహిళను హూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో విమానం 90 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరినట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
PM Modi | ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం
Infosys | ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం