Tesla Car | అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా వై మోడల్ కారు చైనాలో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో.. కారు అదుపుతప్పి ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వాహనదారుడితో పాటు స్కూల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో టెస్లా కారు డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటన నవంబర్ 5వ తేదీన దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్డాన్లో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో టెస్లా కారుపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ ప్రమాద ఘటనపై చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి పోలీసులు వివరణ కోరారు. దీనిపై ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మాట్లాడుతూ.. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని త్వరలోనే అసలు కారణం బయటపడుతందని తెలిపారు.
This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird!
pic.twitter.com/SGEcZcx6Zq— Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022