కల్వకుర్తి, జనవరి 8 : మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న క్రమంలో పలు చోట్ల ఓట్ల గోల్మాల్ వెలుగులోకి వస్తున్నా యి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని బల్దియాలలో ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేసిం ది. ఇందులో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు సంబంధించి ఓటరు జాబితా ప్రతులను బహిర్గత పరిచారు. అభ్యంతరాలకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించారు. ఓటరు ముసాయిదా జాబితా వెలువర్చిన నేపథ్యంలో.. జాబితాలో తప్పులు చూసి ఓటర్లు నివ్వెరబోతున్నారు.
ముందుగా అనుకున్నట్లే కొత్త ఓట్ల నమోదు
కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఇందిరానగర్‌కు( 21వవార్డు) రాజుగౌడ్ ఇంట్లో మొత్తం 6 ఓట్లు ఉన్నాయి. అదే ఇంటి నెంబర్‌పై ఎనిమిది కొత్త ఓట్లు నమోదయ్యాయి. వీరెవరో నాకు తెలియ దు.. మా ఇంటి నెంబర్‌పై కొత్త ఓట్లు ఎవరు నమోదు చేశారో సమాచారం లేదంటూ రాజుగౌ డ్ వాపోయాడు. నా ఇంటి నెంబర్‌పై ఉన్న కొత్త ఓట్లను తొలగించాలని అధికారులకు విన్నవించాడు. అతడి పక్క ఇంట్లో ఒకటే ఓటు ఉంది. ఆ ఇంటి నెంబర్‌పై కూడా నాలుగు కొత్త ఓట్లు నమోదయ్యాయి. వారెవరో ఆ ఇంటి యజమానికి కూ డా తెలియదట. ఇదే వార్డులో 77 అనుమానాస్ప ద ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. ఇది కేవలం ఇందిరానగర్‌లో కాదు.. కల్వకుర్తి మున్సిపాలిటీలోని 22 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి. ఇండ్ల యజమానులకు తెలియకుండా సదరు ఇం టి నెంబర్లపై కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే.. తమకేమీ తెలియదని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది.
భార్య ఒక వార్డులో.. భర్త మరో వార్డులో..
పట్టణంలోని 3వ నెంబర్ వార్డు(తిలక్‌నగర్)లో నివాసం ఉంటున్న భార్యాభర్తలిద్దరూ రెండు వార్డులకు మారిపోయారు. భర్త ఓటు రెండో వార్డులో ఉంటే.. భార్య ఓటు మూడో వార్డులో వచ్చింది. ఒకటే ఇంటి నెంబర్లోని ఓట్లు రెండు వార్డులకు చీలిపోయాయి. ఇలా ఓటరు జాబితా లో రకరకాల మాయాజాలాలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారులను అడిగితే.. అభ్యంతరాలను సరిచేసేందుకు ముసాయిదా విడుదల చేశాం.. అభ్యంతరాలను 9వ తేదీ వరకు రాత పూర్వకంగా ఇస్తే సరిచేస్తామని చెబుతున్నారు.
కొత్త ఓట్ల నమోదులో..
కొత్త ఓట్ల నమోదులో కొందరు నాయకులు తమ తెలివితేటలను ప్రదర్శించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా మున్సిపాలిటేతర వా రిని కల్వకుర్తి మున్సిపాలిటీలో కొత్త ఓటర్లుగా న మోదు చేయించినట్లు తెలుస్తుంది. ప్రతి వార్డులో 50 ఓట్ల వరకు సదరు నాయకులు కొత్త ఓటర్లను నమోదు చేయించారనే ఆరోపణలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి.
జాబితాపై బీఆర్ఎస్ ఆందోళన
కల్వకుర్తి ఓటర్ల ముసాయిదా జాబితాపై బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జా బితాలో విపరీతమైన తప్పులు దొర్లాయిని వాపోతున్నారు. దీనికి అనుమానాస్పదంగా కొత్త ఓట్లు కూడా నమోదయ్యాయని, కొత్తగా నమోదైన ఓటర్ల విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంటి యజమానికి తెలియకుండా సదరు ఇంటి నెంబర్‌పై కొత్త ఓట్లు నమోదు కావడమేమిటని పలువురు ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వక ంగా కొత్త ఓట్లను న మోదు చేశారని ఆ రోపించారు. ఈ విషయమై ఎ న్నికల సం ఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.