Canada | భారత్‌లోని కెనడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. అడ్వైజరీ జారీ చేసిన ట్రూడో ప్రభుత్వం
Canada | భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కెనడా కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో (Indian Cities) ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.
Canada | ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవలే కెనడా (Canada ) ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. భారత్ ఆదేశాల మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడినట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో (Indian Cities) ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.
Also Read..
Canada | 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి తరలించాం : కెనడా
Raj Kundra | రాజ్‌కుంద్రా సంచలన ప్రకటన.. మేము విడిపోతున్నాం అంటూ పోస్ట్
Scotch whisky | వేలంలో రూ. 11 కోట్లు పలకనున్న అరుదైన స్కాచ్ విస్కీ బాటిల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

