Raj Kundra | రాజ్‌కుంద్రా సంచలన ప్రకటన.. మేము విడిపోతున్నాం అంటూ పోస్ట్
Raj Kundra | బాలీవుడ్ స్టార్ కపుల్స్ శిల్పా శెట్టి (Shilpa Shetty), రాజ్ కుంద్రా (Raj Kundra) విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రా తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీస్తోంది. ఆ ట్వీట్లో ‘మేము విడిపోతున్నాం..’ అంటూ రాజ్‌కుంద్రా ప్రకటించడమే ఇందుకు కారణం.
Raj Kundra | బాలీవుడ్ స్టార్ కపుల్స్ శిల్పా శెట్టి (Shilpa Shetty), రాజ్ కుంద్రా (Raj Kundra) విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రా తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీస్తోంది. ఆ ట్వీట్లో ‘మేము విడిపోతున్నాం..’ అంటూ రాజ్‌కుంద్రా ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే, రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి పేరును ప్రస్తావించకుండా.. ‘మేము విడిపోతున్నాం. ఈ కష్టకాలంలో మాకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. అయితే, శిల్పా శెట్టి మాత్రం ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రాజ్ కుంద్రా పోస్ట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. నవంబర్ 2022లో పోర్నోగ్రఫీ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన.. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట ముసుగులు ధరించే కనిపించేవారు. అయితే, తాజాగా ఆయన తన మాస్క్ తీసి కనిపించారు. రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా వస్తున్న బయోపిక్ చిత్రం ‘UT69’. ఈ సినిమాను షానవాజ్ అలీ దర్శకత్వం వహిస్తుండగా.. SVS స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్లోనే రాజ్ కుంద్రా తన మాస్క్ తీసి కనిపించారు. దీంతో మాస్క్‌కు ఇక గుడ్ చెప్పే ఉద్దేశంలోనే రాజ్ కుంద్రా అలాంటి ప్రకటన చేసి ఉంటారంటూ చెప్పుకుంటున్నారు.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
Also Read..
Tiger 3 | సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ నుంచి ‘లేకే ప్రభుకా నామ్’ సాంగ్ టీజర్
Leo Movie | తొలిరోజే వంద కోట్లు.. సంచలనం సృష్టించిన లియో సినిమా..!
Napoleon Movie | ఫ్రెంచ్ చక్రవర్తి బయోపిక్‌లో జోకర్ నటుడు.. ఆసక్తికరంగా ‘నెపోలియన్’ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

