Tiger 3 | సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ నుంచి ‘లేకే ప్రభుకా నామ్’ సాంగ్ టీజర్
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3. టైగర్ ప్రాంఛైజీలో సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3. టైగర్ ప్రాంఛైజీలో సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేకే ప్రభుకా నామ్ (Leke Prabhu Ka Naam) సాంగ్‌ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సాంగ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ టీజర్‌ను చూస్తే.. ఫుల్ పార్టీ మోడ్ సాంగ్లా ఉంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది.
Tiger & Zoya are ready to party! #LekePrabhuKaNaam dropping hot on 23rd Oct on https://t.co/Jt7qgSTwNB Dekho ek choti jhalak…#Tiger3 arriving in cinemas on 12th November. Releasing in Hindi, Tamil & Telugu.#KatrinaKaif | @emraanhashmi | #ManeeshSharma | @yrf |… pic.twitter.com/Sh1hKiyI1U
— Salman Khan (@BeingSalmanKhan) October 20, 2023
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

