Devara Movie | స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్గా నటిస్తుంది. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
అనిరుధ్ ఈ సాంగ్ పడినట్లు తెలుస్తుండగా.. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ సముద్రంలోంచి పడవలో వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో అదిరిపోయింది. ఇక మే 19న వచ్చే ఫుల్ సాంగ్ కోసం తారక్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇక ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ ప్రోమోనే మీరు చూసేయండి.
#FearSong from May 19th… #Devara pic.twitter.com/Tdu6dgjn6Q
— Jr NTR (@tarak9999) May 17, 2024