Devara Movie | అండమాన్ దీవులకు ‘దేవర’ టీమ్.. ఎందుకంటే.?
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాను నటించిన దేవర చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా.. మరో వైపు వార్ 2 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాను నటించిన ‘దేవర’ చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా.. మరో వైపు వార్ 2 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రబృందం తాజాగా అండమాన్ వెళ్లనుంది.
ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై రొమాంటిక్ సాంగ్ షూట్ కోసం ‘దేవర’ టీమ్ అండమాన్ నికోబర్ దీవులకు వెళ్లనుంది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉండగా పుట్టినరోజు అనంతరం దేవర టీమ్ అండమాన్ వెళ్లనున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. మరోవైపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

