Leo Movie | తొలిరోజే వంద కోట్లు.. సంచలనం సృష్టించిన లియో సినిమా..!
Leo Movie | దసరా రిలీజ్‌లలో భీభత్సమైన హైప్‌తో రిలీజైన సినిమా లియో. రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కిందా లేదా అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్లకు వెళ్లారు.
Leo Movie | దసరా రిలీజ్‌లలో భీభత్సమైన హైప్‌తో రిలీజైన సినిమా లియో. రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కిందా లేదా అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజైన లియో సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్లో ఉంటుందన్న ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్‌గా సాటీస్‌ఫై చేయలేకపోయింది. అయితే యాక్షన్ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, లోకేష్ మార్క్ కొన్ని చోట్ల మాత్రం మిస్సయిందని పలువురు చెబుతున్నారు.
టాక్ ఎలా ఉన్నా సినిమాకు మాత్రం భీభత్సమైన కలెక్షన్లు వచ్చాయి. కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా తెలుగులో విజయ్ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక లియో సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. రజనీ కాంత్ తర్వాత తొలిరోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కబాలి, రోబో 2.ఓ సినిమాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి. విజయ్ క్రేజ్‌తో పాటు LCU హైప్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది.
ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. ఒక డబ్బింగ్ హీరో సినిమాకు అది కూడా దసరా పండగ సీజన్లో ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్లోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి మరి. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

