Canada | ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవలే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు కెనడాకు భారత్ డెడ్‌లైన్ పెట్టింది. దీంతో కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియడంతో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను తరలించినట్లు కెనడా తాజాగా వెల్లడించింది. 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడినట్లు గురువారం తెలిపింది.
Also Read..
Congress-BJP | కాంగ్రెస్, బీజేపీలకు రెబెల్స్ గుబులు.. పోటీకి సిద్ధమవుతున్న టికెట్ దక్కని ఆశావహులు
Prabhas | ఈ జనరేషన్ హీరోల్లో ఆ ఫీట్ సాధించింది ప్రభాస్ ఒక్కడే !
Raghunandan Rao | రఘునందన్.. మా ఊరికెందుకొచ్చావ్?.. ఉప ఎన్నికల హామీలపై నిలదీసిన మహిళలు