Prabhas | ప్రభాస్ తన తరం హీరోల్లో ఎవరికీ లేని రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడున్న హీరోలందరూ జనరల్‌గా చేసేవన్నీ సాంఘిక కథాంశాలే. అయితే ఈ జనరేషన్లో విభిన్నమైన జోనర్స్లో నటించే అవకాశం మాత్రం ప్రభాస్‌కే దక్కిందని చెప్పాలి. ప్రభాస్ సాంఘిక చిత్రాలు చాలా చేశారు. అయితే ఈ మధ్యలో ‘బాహుబలి’ సిరీస్ చేయడంతో నేటి తరంలో జానపద వీరుడిగా నటించిన తొలి హీరోగా నిలిచాడు ప్రభాస్. అలాగే ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేసి, అందులో రాముడిగా కనిపించాడు.
మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలోనూ ప్రభాస్ శివుడిగా నటించబోతున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కీ’. ఇది మరో భిన్నమైన కాన్సెప్ట్. ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ. ఇందులోని పాత్రకూ పురాణాలకూ సంబంధం ఉంటుందని టాక్. అంటే సాంఘికాలతోపాటు జానపదం, పౌరాణికం, ఫిక్షన్ పాత్రల్లో నటిస్తూ తన జనరేషన్లో ఏ హీరోకీ లేని రికార్డును సొంతం చేసుకున్నారు ప్రభాస్.