Scotch whisky | వేలంలో రూ. 11 కోట్లు పలకనున్న అరుదైన స్కాచ్ విస్కీ బాటిల్
ఎంతోమంది ఇష్టంగా కోరుకునే స్కాచ్ విస్కీ (Scotch whisky) బాటిల్ వచ్చే నెలలో వేలానికి రానుందని, వేలంలో ఇది రూ. 11 కోట్లకు (1.4 మిలియన్ డాలర్లు) పలుకుతుందని అంచనా వేస్తున్నామని వేలం సంస్ధ సోత్బే వెల్లడించింది.
లండన్ : ఎంతోమంది ఇష్టంగా కోరుకునే పురాతన స్కాచ్ విస్కీ (Scotch whisky) బాటిల్ వచ్చే నెలలో వేలానికి రానుంది. వేలంలో ఇది రూ. 11 కోట్లు (1.4 మిలియన్ డాలర్లు) పలుకుతుందని అంచనా వేస్తున్నామని వేలం సంస్ధ సోత్బే వెల్లడించింది. డిస్టిలర్ మకాల్లన్కి చెందిన 96 ఏండ్ల నాటి సింగిల్ మాల్ట్ బాటిల్‌కు అత్యధిక ధర పలుకుతుందని సోత్బే పేర్కొంది.
స్కాచ్ విస్కీ బ్రాండ్ ది మకాల్లన్ అడామి 1926- నవంబర్ 18న లండన్‌లో 750,000 పౌండ్లు (రూ. 7 కోట్లకు పైగా) అంచనా ధరతో వేలానికి రానుందని పేర్కొంది. అడ్వాన్స్ బిడ్డింగ్ నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. మకాల్లన్ 1926 ఓ వెర్షన్‌ను 2019లో సోత్బే ఏకంగా రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. ఏ వైన్ లేదా స్పిరిట్ బాటిల్‌కైనా ఇదే అత్యధిక ధరగా రికార్డు సృష్టించింది. ప్రతి వేలందారు, సేకరణదారు కోరుకునే విస్కీగా ది మకాల్లన్ 1926 నిలుస్తుందని సోత్బే స్పిరిట్స్ గ్లోబల్ హెడ్ జానీ ఫోలే పేర్కొన్నారు.

నాలుగేండ్ల కిందట తాము ఈ వింటేజ్ వెర్షన్‌కు రికార్డు ధర రాబట్టిన అనంతరం సోత్బే వేలానికి పురాతన బాటిల్‌ను తీసుకురావడం పట్ల ఉత్సుకతతో ఉన్నామని అన్నారు. ఇప్పుడు కేవలం 40 మకాల్లన్ 1926 బాటిల్స్ అందుబాటులో ఉన్నాయని, వీటిలో 14 బాటిల్స్ మకాల్లన్ ఐకానిక్ ఫైన్, రేర్ లేబుల్‌తో ముందుకొచ్చాయని, వచ్చే నెలలో విక్రయించనున్న బాటిల్‌తో సహా 12 బాటిల్స్‌ను ఇటాలియన్ పెయింటర్ వలెరియో అదామి డిజైన్ చేశారు.
Read More :
Viral Video | నవరాత్రి వేడుకల్లో ట్విస్ట్ : నీటి లోపల గర్భాతో అదరగొట్టాడు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- auction
- bottle
- Scotch Whisky
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

