Titan submersible | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ (Titanic) నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది.
ఈ ఘటనపై కెనడా (Canada) విచారణ ప్రారంభించింది. సబ్ ఉపరితల నౌక పోలార్ ప్రిన్స్ కెనడియన్ ఫ్లాగ్డ్ షిప్ (Canadian-flagged ship) అయినందున ఈ సంఘటనపై దర్యాప్తు (investigation) చేపట్టినట్లు కెనడా ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (Canadian safety officials) తెలిపింది.
శతాబ్దం క్రితం అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఓషన్ గేట్ ఎక్స్ పిడీషన్స్ అనే సంస్థ ఈ సాహసయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాత్రకు ఆదివారం మినీ టైటాన్ బయలు దేరింది. ఈ మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపాడా ఆక్సిజన్ ఉంది. అయితే, సాగరగర్భంలోకి వెళ్లిన గంటా 45 నిమిషాల తర్వాత టైటాన్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దాని జాడ కోసం కెనడా, అమెరికా దళాలు సముద్రాన్ని నాలుగు రోజుల పాటు జల్లెడపట్టాయి. అయినా ఫలితం లేకపోయింది. సముద్రం లోపల తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయింది. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Boat Capsize | వలసదారులతో వెళ్తున్న మరో పడవ బోల్తా.. 37 మంది గల్లంతు
Rahul Gandhi | ఇకనైనా పెళ్లి చేసుకోవయ్యా.. రాహుల్ కు లాలూ సూచన.. కాంగ్రెస్ నేత సమాధానం ఏంటంటే..?
Maharashtra | 36 ఏళ్లుగా కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి.. వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన