లండన్ : జమ్ముకశ్మీర్‌పై భారత విధానానికి మద్దతుగా నిలబడే బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని, ఈ భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఆయన ప్రకటించారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, తన అభిప్రాయాలు 1990లో జరిగిన ఘటనలు, ముఖ్యంగా కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా ఏర్పడ్డాయని చెప్పారు.
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ప్రభావితం కాలేదని అన్నారు. ‘ప్రజలను వారి మతం, నేపథ్యం కారణంగా వారి స్వస్థలాల నుంచి బలవంతంగా వెళ్లగొట్టడం తప్పు. ఇది అన్యాయమని ప్రజలకు చెప్పడానికి మేం ఆ సమయంలో ఒక భారీ సమావేశం నిర్వహించాం’ అని ఆయన అన్నారు.