Brazil | న్యూఢిల్లీ: వాతావరణ పరిరక్షణ లక్ష్యంతో నిర్వహించే సదస్సు కోసం బ్రెజిల్ చేస్తున్న ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)-30 వాతావరణ సదస్సుకు వేలాది మంది ప్రతినిధులు హాజరవుతారు. వీరంతా ప్రయాణించడం కోసం ఓ రోడ్డును నిర్మిస్తున్నారు. దీని కోసం అమెజాన్ రెయిన్ఫారెస్ట్లోని వేలాది చెట్లను నరికేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బ్రెజిల్‌కు ఉన్న నిబద్ధత ఏమిటని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
అడవులు పెద్ద మొత్తంలో కార్బన్‌ను శోషించుకుంటున్నాయని, అసాధారణ జీవ వైవిధ్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. కొత్త రోడ్డు వల్ల జీవనోపాధిని కోల్పోతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, బ్రెజిల్ ప్రెసిడెంట్, పర్యావరణ శాఖ మంత్రి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది చారిత్రాత్మక సదస్సు అని చెప్పారు.