Cardiac Arrest | దారుణం : రన్నింగ్ చేస్తుండగా ఆగిన బాలుడి గుండె
కోవిడ్-19 అనంతరం వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు (Cardiac Arrest) ఘటనలు పెరుగుతున్నాయి. యువకులు, మధ్యవయస్కులు సైతం గుండె పోటుతో హఠాన్మరణానికి గురవుతున్నారు.
న్యూయార్క్ : కోవిడ్-19 అనంతరం వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు (Cardiac Arrest) ఘటనలు పెరుగుతున్నాయి. యువకులు, మధ్యవయస్కులు సైతం గుండె పోటుతో హఠాన్మరణానికి గురవుతున్నారు. చిన్న పిల్లల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. లేటెస్ట్గా అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ఏండ్ల బాలుడు కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో నిర్వహించిన 5కే రేస్‌లో పాల్గొన్న బాలుడు నాక్స్ మాక్వెన్ గుండెపోటుతో కుప్పకూలాడు.
స్కూల్‌కు ఎమర్జెన్సీ బృందం చేరుకుని అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. డేవిస్ వెస్ట్రన్ హైస్కూల్లో చదువుతున్న బాలుడు జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ డ్రిల్‌లో పాల్గొంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాలుడు కుటుంబ స్నేహితుడు గోఫండ్‌మి క్యాంపెయిన్ చేపట్టగా అంత్యక్రియల నిర్వహణకు 66,000 డాలర్లు సమకూరాయి. బాలుడి మృతి పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. రన్నింగ్ చేస్తూ మాక్వెన్ కుప్పకూలడం దురదృష్టకరమని, బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాలుడి తల్లి జూలీ గత ఏడాది క్యాన్సర్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఇప్పుడు కొడుకును విధి బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. కొద్దినెలల కిందట అమెరికాలో 17 ఏండ్ల బాస్కెట్‌బాల్ ఆటగాడు తన టీంతో కలిసి వర్కవుట్ సెషన్లో పాల్గొంటూ కుప్పకూలాడు. ఇక జిమ్‌ల్లో వ్యాయామం చేస్తూ పలువురు గుండెపోటుకు గురై మరణించిన ఉదంతాలూ చోటుచేసుకున్నాయి.
Read More :
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Boy
- Cardiac arrest
- Dies
- running
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

