గజం.. రూ.2 లక్షలు!
హెచ్ఎండీఏ మరోసారి భారీ భూముల వేలానికి తెరలేపింది. నగరంలోని అత్యంత ఖరీదైన, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న భూములు, ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేయగా... ఈ నెల 12 నుంచి 27 వరకు ఆరు విడతలుగా ఈ ఆన్లైన్ ఈ-వేలం నిర్వహించనుంది. అయితే ఈ సారి చదరపు గజానికి రూ. 2లక్షల చొప్పున హకీంపేట్‌లోని హుడా హైట్స్‌లో కనీస ధరగా నిర్ణయించారు.
-
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం షురూ
-
పలు ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయానికి చర్యలు
-
నవంబర్ 12 నుంచి ఆన్లైన్ వేలం
సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ మరోసారి భారీ భూముల వేలానికి తెరలేపింది. నగరంలోని అత్యంత ఖరీదైన, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న భూములు, ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేయగా… ఈ నెల 12 నుంచి 27 వరకు ఆరు విడతలుగా ఈ ఆన్లైన్ ఈ-వేలం నిర్వహించనుంది. అయితే ఈ సారి చదరపు గజానికి రూ. 2లక్షల చొప్పున హకీంపేట్‌లోని హుడా హైట్స్‌లో కనీస ధరగా నిర్ణయించారు.
ఇకడ కోట్లు విలువ చేసే 1,000 చదరపు గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలంలో ఉంచారు. భూముల వేలంతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఈ సారి 6 విడతల్లో భారీ వేలానికి సన్నద్ధం చేసింది.ఇకడ కోట్లు విలువ చేసే 1,000 చదరపు గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలంలో ఉంచారు. భూముల వేలంతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఈ సారి 6 విడతల్లో భారీ వేలానికి సన్నద్ధం చేసింది.
గజం.. రూ.2 లక్షలు!
ప్రైమ్ ఏరియాలోని ప్లాట్లతో పాటు, నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ పార్శిళ్లను కూడా విక్రయించనుంది. ఇందులో కోకాపేట్ నియోపొలీస్ 4.59 ఎకరాల భూమికి ఎకరాకు రూ. 120 కోట్లు, మరో 8,591 చ.గజాల స్థలానికి గజానికి రూ. 1.50 లక్షల కనీస ధరను ఖరారు చేసింది. కూకట్పల్లి సమీపంలోని 3 ఎకరాల ప్లాట్‌కు ఎకరం అప్సెట్ ధర రూ. 99 కోట్లుగా నిర్ణయించారు. అదేవిధంగా రాయదుర్గంలో 1,815 చ.గజాల స్థలానికి చ.గజానికి రూ. 1.75 లక్షల చొప్పున ధరను నిర్ణయించి భూములను విక్రయించనుంది.
చిన్న ప్లాట్ల సంఖ్య పెంపు..
గతంలో కేవలం కోకాపేట్, రాయదుర్గం వంటి ప్రాంతాలకే పరిమితమైన భూముల వేలం… ఈసారి చిన్న ప్రాంతాలను విస్తరించింది. కేవలం మిడిల్ క్లాస్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, బాచుపల్లి, ఇన్ముల్‌నర్వ, సూరారం, కాప్రా, అమీన్పూర్ ప్రాంతాల్లోని లేఅవుట్లలోనూ చిన్న ప్లాట్లను అందుబాటులో ఉంచిం ది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వలో గజం కేవలం రూ. 15,000 అప్ సెట్ ధరతో 45 ప్లాట్లను వేలానికి పెడుతున్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు ప్రతి ప్లాట్ కు రూ. 3 లక్షలు డిపాజిట్ చెల్లించి ఆన్లైన్లో జరిగే వేలంపాటలో పాల్గొనవచ్చు. హెచ్ఎండీఏ చిన్న ప్లాట్లను మార్కెట్లోకి తీసుకువచ్చి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

