మంగళవారం 02 మార్చి 2021
International - Jan 22, 2021 , 01:23:23

బాగ్దాద్‌లో బాంబుల మోత..32 మంది మృతి

బాగ్దాద్‌లో బాంబుల మోత..32 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ బాంబులతో దద్దరిల్లింది. గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరుగడంతో 32 మంది మరణించారు. 73 మంది గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే బాబ్‌ అల్‌-షార్కి ప్రాంతంలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. తమవెంట తెచ్చుకున్న బాంబులను పేల్చడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. 

VIDEOS

logo