లండన్: రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్ స్పల్వ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా తమ దౌత్యవేత్తల కీవ్ ఉమ్మడి సందర్శనకు ముందు మాస్కో, టెహ్రాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించాయి. లండన్‌ను సందర్శించిన అమెరికా కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ బ్రిటిష్ విదేశీ కార్యదర్శితో మాట్లాడుతూ ఇలా ఆయుధాలు సరఫరా చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించినా ఇరాన్ లెక్కచేయలేదని అన్నారు.