కోల్‌కతా, డిసెంబర్ 31: పశ్చిమ బెంగాల్లో 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో స్థానిక టీఎంసీ నేత షాజ్‌హాన్ షేక్ భూఆక్రమణ, మహిళలపై లైంగిక వేధింపులకు నిరసనగా సందేశ్‌ఖాలీలో మహిళలు చేసిన నిరసన, 24 పరగణాల జిల్లాలోని ఒక గ్రామంలో మమతా బెనర్జీ పర్యటన తదితర విషయాలను ఆయన ప్రస్తావిస్తూ.. తాము అధికారంలోకి వస్తే దీనిపై ఒక కమిషన్ వేసి విచారణ జరుపుతామని చెప్పారు. సందేశ్‌ఖాలీలో ఆందోళన చేసిన మహిళలను అరెస్ట్ చేసిన మమతా బెనర్జీని కూడా జైలుకు పంపుతామని ఆయన తెలిపారు.