Jack Ma | చైనాను వీడిన అలీబాబా ఫౌండర్ జాక్‌మా.. ఎక్కడున్నారో తెలుసా..?
Billionaire Jack Ma | ప్రముఖ బిలియనీయర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గతకొంతకాలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన దీంతో ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాక్‌మా ఆచూకీ వెలుగులోకి వచ్చింది. గత ఆరు
Jack Ma | ప్రముఖ బిలియనీయర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గతకొంతకాలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన దీంతో ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాక్‌మా ఆచూకీ వెలుగులోకి వచ్చింది. గత ఆరు నెలలుగా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నారని, లో ప్రొఫైల్ జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిసింది. 2020లో ఘర్షణ నేపథ్యంలో జిన్‌పింగ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తర్వాత జాక్ మా కంపెనీపై ప్రభుత్వం బిలియనర్ల డాలర్ల జరిమానా విధించారు. గత కొద్ది రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం జాక్‌మా తన కుటుంబంతో కలిసి టోక్యో వెలుపల హాట్ స్ప్రింగ్ అండ్ స్కీ రిసార్ట్‌లో నివసిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. అలాగే ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లో చైనాసీ రెగ్యులేటర్‌పై జాక్ విమర్శలు చేసిన అనంతరం చాలాకాలం పాటు కనిపించలేదు. అడపాదడపా పలు ప్రోగ్రామ్‌లకు హాజరయ్యారు. చైనీస్ ప్రభుత్వంతో ఘర్షణకు ముందు తరుచూ పలు కార్యక్రమాలకు వక్తగా హాజరయ్యేవారు. ఆయన ప్రసంగాలకు యువతలో మంచి క్రేజ్ ఉన్నది. అయితే, 2020 అక్టోబర్‌లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్‌మా చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను మండిపడ్డారు.
చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల ఆలోచనను వీడాలని, సంప్రదాయబద్ధంగా వస్తోన్న ఆర్థిక విధానాల్లో సమూలమార్పులు అవసరమన్నారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని చెబుతూ ఇవి ఎలా ఉన్నాయంటే రోగికి తప్పుడు మెడిసిన్స్ ఇచ్చినట్లుగా పని చేస్తాయని ఎద్దేవా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఉలిక్కిపడింది. ఆ తర్వాత జాక్‌మా నేతృత్వంలోని కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ ఆదేశాల మేరకు చైనా అధికారులు నవంబర్ 2020లో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ల డాలర్ల ఐపీఓను అధికారులు నిలిపివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

