ఆంట్వెర్ప్: బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి అప్పగించేందుకు ఆంట్వెర్ప్లోని ఓ కోర్టు అనుమతి ఇచ్చింది. బెల్జియం సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి ఆయనకు 15 రోజుల గడువు ఉంది. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేరకు మోసం చేసినట్లు కేసులు దర్యాప్తులో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ విజ్ఞప్తి మేరకు చోక్సీని ఏప్రిల్ 11న ఆంట్వెర్ప్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన బెయిలు దరఖాస్తులను కోర్టు చాలాసార్లు తిరస్కరించింది. తాజా తీర్పులో ఆయనను అరెస్ట్ చేయడం సరైనదేనని స్పష్టం చేసింది. ఆంట్వెర్ప్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణలో చోక్సీ న్యాయవాదుల బృందంతో భారత్ తరపున వాదిస్తున్న బెల్జియన్ ప్రాసిక్యూటర్లు తలపడ్డారు. చోక్సీని అరెస్ట్ చేయడం చట్టబద్ధమేనని న్యాయమూర్తులు తెలిపారు. ఆయనపై మోపిన నేరాలు భారత్‌తోపాటు బెల్జియం చట్టాల ప్రకారం కూడా శిక్షార్హమైనవేనని పేర్కొన్నారు.