ఇజ్రాయెల్ ప్రధానిగా మరోసారి ఎన్నికైన బెంజమిన్ నెతన్యాహు
Benjamin Netanyahu | ఇజ్రాయెల్‌లో గత మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. మాజీ పీఎం నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
గాజా: ఇజ్రాయెల్‌లో గత మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. మాజీ పీఎం నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమి 64 స్థానాలు సొంతం చేసుకున్నది. దీంతో నెతన్యాహు విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా నెతన్యాహు ఇప్పటికే రికార్డు సృష్టించారు. తాజాగా మరోసారి ఆయన ప్రధాని పీఠం ఎక్కనున్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ఇందులో 62 సీట్లు గెలుపొందిన పార్టీయే అధికారం చేపట్టనుంది. దీంతో 73 ఏండ్ల నెతన్యాహు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. ఆయన నాయకత్వంలోని లికడ్ (Likud) పార్టీ సొతంగా 32 స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో గత నాలుగేండ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి కావడం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

