మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 23:14:28

నలుగురం కలిసి పనిచేద్దాం: చైనా

నలుగురం కలిసి పనిచేద్దాం: చైనా

బీజింగ్ : నాలుగు దేశాలు కలిసి పనిచేద్దామని చైనా పిలుపునిచ్చింది. కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించడానికి "చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) తోపాటు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) కింద ప్రాజెక్టుల పనిని కొనసాగిద్దామని చైనా.. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ ను కోరింది.

సోమవారం మూడు దేశాల్లోని తన సహచరులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అధ్యక్షత వహించారు. సీపీఈసీని ఆఫ్ఘనిస్తాన్‌ వరకు విస్తరించడానికి నాలుగు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

కొవిడ్ -19 మహమ్మారి గురించి చర్చించేందుకు బీజింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్.. భారత-చైనా సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్‌తో భారత్‌కు ఉన్న సంబంధాల దృష్ట్యా.. న్యూఢిల్లీలో విదేశాంగ విధాన స్థాపనతో ఇలాంటి సమావేశాల నిర్వహణలో వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు.

స్టేట్ కౌన్సిలర్ హోదా కలిగిన చైనా యొక్క సీనియర్ దౌత్యవేత్తలలో ఒకరైన వాంగ్ యి.. నాలుగు దేశాలతోపాటు మధ్య ఆసియా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవాలి" అని సోమవారం రాత్రి మాండరిన్ భాషలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

నాలుగు దేశాలు "చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ట్రాన్స్-హిమాలయన్ త్రిమితీయ ఇంటర్ కనెక్టివిటీ నెట్‌వర్క్ నిర్మాణాన్ని చురుకుగా ప్రోత్సహించాలి, ఆఫ్ఘనిస్తాన్‌కు సీపీఈసీ విస్తరణకు మద్దతు ఇవ్వాలి, ప్రాంతీయ ఇంటర్ కనెక్షన్ డివిడెండ్‌ను మరింత విడుదల చేయాలి" అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంతో సంబంధం లేకుండా దక్షిణ ఆసియాలోని నాలుగు దేశాల సహకారం కోసం చైనా పిలవడం చాలా అరుదు. అయితే, ఈ చర్య బీజింగ్ ప్రస్తుత నేపథ్యానికి సరిపోతుందని చెప్పవచ్చు.

యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ శాంతి ప్రక్రియలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా చైనా ఉన్నదని ఈ సమావేశం తెలియజేస్తున్నదని.. అలాగే, నేపాల్ కోసం భారత్‌తో ఉన్న సంబంధాల మధ్య చైనాతో పెరుగుతున్న సంబంధాల గురించి సందేశం పంపే అవకాశం ఇది అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.


logo