Bangladesh | భారత్- బంగ్లాదేశ్ (India-Bangladesh)ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు చెప్పారు.
బంగ్లాదేశ్-భారత్ మధ్య బంధం సన్నిహితంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఇటీవలే కొన్ని విభేదాలు తలెత్తినట్లు (misunderstandings) చెప్పారు. అవి వచ్చిపోయే మేఘాల్లాంటివిగా అభివర్ణించారు. తప్పుడు సమాచారం, దుష్ప్రచారాలే ఈ ఘర్షణలకు కారణమని పేర్కొన్నారు. వీటిని తొలగించి.. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. తమ అధికారులు భారత్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Maharashtra | మహా రాజకీయాల్లో కాకరేపుతున్న సర్పంచ్ హత్య కేసు.. మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా
MK Stalin | ఉత్తరాదిలో మూడో భాష ఏది..? కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్న
Donald Trump | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు