Bangladesh | ఆ ఒప్పందం జరిగితేనే భారత్‌తో బంధం కొనసాగుతుంది : బంగ్లాదేశ్
Bangladesh | భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం కోసం చర్చలు జరపాలని భారత్‌ను డిమాండ్ చేసింది.
Bangladesh : భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం కోసం చర్చలు జరపాలని భారత్‌ను డిమాండ్ చేసింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ (India-Bangladesh) గంగానది నీటి ఒప్పందం 1996లో జరిగింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా హయాంలో కుదిరిన ఈ డీల్ ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. కొత్త ఒప్పందం కుదిరేవరకు పాత ఏర్పాట్లే కొనసాగాలని బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో జరిగే నీటి ఒప్పందాలకు కాలపరిమితి ఉండవద్దని ఆలంగీర్ షరతు విధించారు. కాగా, గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మా నదిగా పిలుస్తారు. అక్కడి వ్యవసాయం, పర్యావరణం, తాగునీటి వ్యవస్థలకు ఈ నది ఎంతో కీలకం. బంగ్లాదేశ్‌లోని మూడో వంతు జనాభా జీవనోపాధి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. ఫరక్కా బ్యారేజ్ వల్ల తమకు ఎండాకాలంలో నీటి ప్రవాహం తగ్గిపోతోందని బంగ్లాదేశ్ అంటోంది. దీనివల్ల నదుల్లో ఉప్పునీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయని వాదిస్తోంది. మరోవైపు కోల్‌కతా పోర్టు రక్షణ కోసమే ఫరక్కా బ్యారేజ్ నిర్మించినట్లు భారత్ మొదటి నుంచి చెబుతోంది.
ఈ ఇబ్బందులను అధిగమించే పేరిట బంగ్లాదేశ్ పద్మా నదిపై ఒక మెగా బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది 2033 నాటికి పూర్తి చేయాలని ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ బ్యారేజ్ నిర్మాణంపై భారత్‌తో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ ఏకపక్షంగా నిర్ణయించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- BNP
- India
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

