ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దయ్యింది. ఆమెతోపాటు మొత్తం 97 మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నేరపూరిత అభియోగాలను ఎదుర్కొంటున్న వీళ్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్టు బంగ్లాదేశ్ తెలిపింది.
అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్ జారీచేసిన మరుసటి రోజే.. బంగ్లాదేశ్ ఆమె పాస్‌పోర్టును రద్దు చేయటం గమనార్హం.