ఢాకా : బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ముందంజలో ఉంది. గురువారం దేశంలోని 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కడపటి వార్తలందేసరికి బీఎన్పీ 53 సీట్లలో విజయం సాధించగా, జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 38 స్థానాల్లో నెగ్గింది.
బీఎన్పీ చీఫ్ తారిక్ రెహమాన్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రోజు నూతన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి గుర్తుగా ఆ దేశ తాత్కాలిక నేత మహ్మద్ యూనిస్ పేర్కొన్నారు. కాగా, ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యార్థుల ఉద్యమంతో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.