ఢాకా: బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ప్రత్యేక జడ్జి కోర్ట్-5 గురువారం మూడు అవినీతి కేసుల్లో మొత్తంగా 21 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఆమె కొడుకు, కూతురుకు కూడా ఈ శిక్ష అమలుకు ఆదేశించింది.
ఢాకా పక్కన ఉండే పూర్బాంచల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లో హసీనా దరఖాస్తు చేయనప్పటికీ ఆమెకు చట్ట విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారని జడ్జి మమున్ అన్నారు.