Pakistani military | పాకిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్ (Pakistani military convoy)పై దాడి (attack) జరిగింది. క్వెట్టా నుంచి టఫ్లాన్ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సుమారు 21 మంది గాయపడినట్లు వెల్లడించాయి. ‘క్వెట్టా నుంచి టఫ్తాన్‌కు వెళ్తున్న భద్రతా దళాల కాన్వాయ్‌పై బలూచిస్థాన్‌లోని నోష్కిలో దాడి జరిగింది. ఏడు బస్సులు, రెండు వాహనాలతో కూడిన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఒక బస్సును ఐఈడీలతో నిండిన వాహనం ఢీ కొట్టింది. ఇది ఆత్మాహుతి దాడి కావొచ్చు’ అని పాక్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) బాధ్యత వహించింది. తమ దాడిలో 90 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించినట్లు తెలిపింది. ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫిదాయీ యూనిట్ ‘మజీద్ బ్రిగేడ్’ కొన్ని గంటల క్రితం నోష్కి సమీపంలోని పాక్ మిలిటరీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుంది. దానిలో ఎనిమిది బస్సులు ఉన్నాయి. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దాడి జరిగిన వెంటనే బీఎల్ఏకి చెందిన ఫతే స్క్వాడ్ ముందుకు సాగి మరో బస్సును చుట్టుముట్టింది. అందులోని సైనికులను హతమార్చింది. మొత్తం శత్రువుల మరణాల సంఖ్య 90కి చేరింది’ అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది.
కాగా, ఐదు రోజుల క్రితం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైల్లో 400 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ బందీలుగా మార్చి పలువురిని చంపేశారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Train Hijack) నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) ప్రకటించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు.
Also Read..
Train Hijack | 214 మంది పాక్ సైనికులను హతమార్చాం : బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
America Storm | అమెరికాను వణికించిన భీకర తుపాను.. 34 మంది మృతి