Anthony Albanese | ఆస్ట్రేలియా ప్రధాని (Australian PM) ఆంథోని ఆల్బనీస్ (Anthony Albanese) స్టేజ్‌పై కింద పడిపోయారు. ఓ కార్యక్రమంలో భాగంగా స్టేజ్‌పై ఫొటోలకు ఫోజులిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయారు (Anthony Albanese falls off stage). అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలూ కాలేదు.
Anthony Albanese has fallen off the stage while speaking at a mining union conference… pic.twitter.com/Z716MlW629
— Roman Mackinnon (@RomanMackinnon6) April 3, 2025
మే 3న ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అల్బనీస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం న్యూ సౌత్ వేల్స్ (New South Wales)లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ఆంథోనితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. స్టేజ్‌పై ప్రసంగం తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆయన ఎడమవైపుకు వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అక్కడే ఉన్న నేతలు ఆయన్ని పైకి లేపారు. అయితే, ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
BREAKING: Prime Minister Anthony Albanese just fell off the stage during a campaign event.
No reported injuries. pic.twitter.com/FoZZqDBDhy
— Australians vs. The Agenda (@ausvstheagenda) April 3, 2025
Also Read..
Myanmar | 3,000 దాటిన మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం
Tariffs | టారిఫ్‌ల నుంచి రష్యా, ఉత్తర కొరియా దేశాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్.. ఎందుకంటే..?
Elon Musk | ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలగనున్న మస్క్.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్