మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అల్బనీస్‌తో ప్రధాని మోదీ గురువారం సమావేశమై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్య, విద్యుత్తు, అంతరిక్షం, కీలక ఖనిజాల ఒప్పందాల్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్‌కు యురేనియం సరపరా చేయనుంది. భారత గగన్‌యాన్ మిషన్‌కు మద్దతుగా కొకొస్ దీవుల్లో ఆస్ట్రేలియా రోదసి ట్రాకింగ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తుందన్నారు.
భారత్‌లోని పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులకు మోదీ తెలిపారు. ఇరు దేశాల్లోని రాష్ర్టాలు, చిన్న నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం విస్తరించాలని సూచించారు.