కాన్బెర్రా: తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వర్కర్ల సంఖ్యను తగ్గించడానికి వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. రానున్న రెండేండ్లలో విదేశీ విద్యార్థులు, కార్మికుల సంఖ్యను భారీగా తగ్గిస్తామని హోం శాఖ మంత్రి క్లార్ ఓనియెల్ చెప్పారు.
ప్రతిపాదిత విధానాల ప్రకారం ఇకపై విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్ టెస్టుల్లో ఎక్కువ రేటింగ్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన వర్కర్ల కోసం కొత్త ప్రత్యేక వీసాను తీసుకొచ్చి, దాని ప్రాసెసింగ్ సమయాన్ని ఒక వారానికి తగ్గించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తున్నది.