న్యూయార్క్: అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియోలను బట్టి ఈ దేవాలయానికి వెళ్లే మార్గంలోఅర్థరహితమైన రాతలు రాసినట్లు తెలుస్తున్నది. ప్రధాని మోదీ ఈ నెల 22న ప్రసంగించబోతున్న వేదికకు 28 కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉంది.