Explosion | ఇటలీలోని రోమ్ (Rome)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంకులో భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు.
ఇటాలియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రెనెస్టినో ప్రాంతంలోని ఎల్పీజీ పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన (explosion at a petrol station) జరిగింది. పేలుడు శబ్దం రాజధాని అంతటా వినిపించింది. ఈ ఘటనలో 16 మంది పౌరులు, ఎనిమిది మంది పోలీసులు, ఫైర్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడి వారిలో ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని అధికారులు తెలిపారు. మరోవైపు అక్కడ ఇంకా మంటలు అదుపులోకి రాలేదని స్థానిక అధికారులను ఊటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
Thalapathy Vijay | సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్.. టీవీకే కీలక ప్రకటన
Bomb Threat | వడోదరలోని పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు
Viral Video | కాలేజ్ వ్యాన్కోసం పరిగెడుతున్న బాలుడిని ఢీ కొన్న బస్సు.. షాకింగ్ వీడియో