కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక హోటల్లో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తాలిబన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. (Afghanistan Blast) సోమవారం కాబూల్‌లోని షహర్-ఎ-నావ్‌లో ఒక హోటల్లో పేలుడు సంభవించినట్లు పేర్కొంది. ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ స్థానిక విభాగం ఈ పేలుడుకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
కాగా, సురక్షితమైన, విదేశీ పౌరులు నివసించే షహర్-ఎ-నావ్‌లోని చైనీస్ హోటల్లో ఈ పేలుడు జరుగడం కలకలం రేపింది. చాలా మంది మరణించారని, పలువురు గాయపడినట్లు తాలిబాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ ఒక వార్తా సంస్థకు తెలిపారు. మరిన్ని వివరాలు తర్వాత అందజేస్తామని చెప్పారు. అయితే ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలను అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి.
#BREAKING: Massive explosion hit a Chinese hotel on Gulfaroshi Street in Kabul’s Shahr-e-Naw area in Afghanistan, causing several casualties. Exact nature of blast is still under investigation as per Kabul Police Chief. Not known if it was a terror attack or Gas Cylinder blast. pic.twitter.com/os1HJxQRcs
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 19, 2026
Also Read:
Modi Welcomes UAE President | భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు.. స్వయంగా స్వాగతం పలికిన మోదీ
Nitin Nabin Files Nomination | ఏకైక అభ్యర్థిగా నితిన్ నబిన్.. బీజేపీ అధ్యక్ష పదవికి 37 నామినేషన్లు