న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. ఈ పార్టీ సీనియర్ నేత నితిన్ నవీన్ (Nitin Nabin)కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆయన తరుఫున 36 నామినేషన్లు అందాయి. బీజేపీ జాతీయ మండలి, పార్లమెంటరీ పార్టీ ఒక నామినేషన్ దాఖలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పదవీ విరమణ చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరో 20 మంది సీనియర్ నేతలు ఈ నామినేషన్ పత్రంపై సంతకాలు చేసి ప్రతిపాదించారు.

Bjp Nominations
కాగా, సోమవారం సాయంత్రం 4 గంటలకు నామినేషన్ దాఖలు, సాయంత్రం 6 గంటలకు ఉపసంహరణ గడువు ముగిశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేస్‌లో ఏకైక అభ్యర్థిగా నితిన్ నవీన్ ఉన్నట్లు ఆ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే లక్ష్మణ్ సోమవారం తెలిపారు. దీంతో ఆయన ఎన్నికను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు జిల్లా, మండల, బూత్ స్థాయి అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను కూడా ఆ పార్టీ చేపట్టింది.
Also Read:
Modi Welcomes UAE President | భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు.. స్వయంగా స్వాగతం పలికిన మోదీ