Gaza | ఇజ్రాయెల్ దాడుల్లో 42 మంది పాలస్తీనియన్లు మృతి
Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఐడీఎఫ్ జరుపుతున్న ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు.
Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఐడీఎఫ్ జరుపుతున్న ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ (Israel) దళాలు జరిపిన వైమానిక దాడులు, కాల్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న దాదాపు 42 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినట్లు పేర్కొంది. తాజా దాడుల్లో అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది.
గాజాలో 58 వేలు దాటిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ : ట్రంప్
గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది.
హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని
గాజా (Gaza)లో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ (Hamas)ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. ‘హమాస్ ఉండదు.. హమస్థాన్ ఉండదు. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Russia Attack: కీవ్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా..
Texas | టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. 24 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

