US Independence Day | అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు (US Independence Day). ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, కవాతుల మధ్య సందడిగా జరుపుకున్నారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో సైతం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ (B2 Bombers) వైట్‌హౌస్ (White House) మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియాతో కలిసి ట్రంప్ (Donald Trump) సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని వైట్‌హౌస్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, వ్యూహాత్మక ఆయుధాల్లో ఒకటి. వీటిని ఇటీవలే ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధంలో అగ్రరాజ్యం ఉపయోగించిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రాలపై జరిపిన ఈ దాడుల కోసం వీటిని ఉపయోగించింది. ఇవి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఏమార్చి కచ్చితమైన దాడుల (ప్రెసిషన్ అటాక్స్)తో విరుచుకుపడగలవు. 40 వేల పౌండ్ల (18 వేల కిలోల) మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలిగే ఈ ‘రాకాసి’ యుద్ధ విమానాలు అత్యంత రక్షణ కలిగిన లక్ష్యాలను సైతం నాశనం చేయగలవు. స్టెల్త్ ఫీచర్లను కలిగి ఉండే ఈ బాంబర్లను గుర్తించడం, ట్రాక్ చేయడం, ప్రతిఘటించడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న సైనిక విమానాల్లో ఇదే అత్యంత ఖరీదైనది. ఒక్కో బీ-2 బాంబర్ ఖరీదు దాదాపు 210 కోట్ల డాలర్లు (రూ.18,182 కోట్లు). నార్త్రోప్ గ్రమ్మన్ కంపెనీ తయారు చేసిన ఈ భారీ, లాంగ్-రేంజ్ బాంబర్ మార్గం మధ్యలో ఇంధనాన్ని నింపుకోకుండా ఏకబిగిన దాదాపు 7 వేల మైళ్లు (11 వేల కిలోమీటర్లు), ఒకసారి రీఫ్యూయలింగ్‌తో 11,500 మైళ్లు (18,500 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటల వ్యవధిలోనే చేరుకోగలదు.
Also Read..
Texas | టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. 24 మంది మృతి
US Independence Day | అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు.. బాణసంచా వెలుగుల్లో అగ్రరాజ్యం జిగేల్
One Big Beautiful Bill | ట్రంప్ సంతకంతో.. చట్టంగా మారిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు