బ్యాంకాక్, జూన్ 14: మయన్మార్‌లోని పెకాన్ పట్టణంలో తాజాగా చెలరేగిన ఘర్షణల్లో కనీసం 26 మంది పౌరులు చనిపోయారని స్థానిక హక్కుల సంఘం బుధవారం వెల్లడించింది.
స్థానిక మిలిటెంట్ గ్రూపులు, మయన్మార్ సైన్యం మధ్య ఈ ఘర్షణలు జరిగాయని, మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. మయన్మార్‌లో 2021లో సైన్యం దేశాధికారాన్ని హస్తగతం చేసుకొన్నాక ప్రజల అగ్రహం పెరిగిపోయింది. దీంతో తరచూ జరుగుతున్న ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి.