వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి కేట్ రూబిన్స్ క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. కేట్ రూబిన్స్ 185 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో గడిపారు. దాదాపు వందల గంటలు అంతరిక్షంలో గడిపిన అనంతరం తన మిషన్ పూర్తి చేసుకుని భూమిపైకి క్షేమంగా దిగింది.
భూమిపైకి క్షేమంగా తిరిగి రావడం పట్ల కేట్ ఆనందం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచే కేట్ రూబిన్స్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని చరిత్ర పుటల్లోకెక్కారు.
స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగామి కేట్ రూబిన్స్ శుక్రవారం రాత్రి 9.34 గంటలకు భూమికి రావడం ప్రారంభించగా.. శనివారం మధ్యాహ్నం కల్లా కజికిస్తాన్‌కు ఆగ్నేయంగా ఉన్న బెజ్కాజ్గాన్ నగరంలో విజయవంతంగా దిగారు.
కేట్ ప్రయాణించిన సోయుజ్ ఎంఎస్-17 అంతరిక్ష నౌక క్షేమంగా భూమిపైన దిగిన అనంతరం నాసాకు చెందిన పలువురు ఉద్యోగులు ఆమెను నౌక నుంచి క్షేమంగా కిందికి దింపారు. అనంతరం సిబ్బంది, కుటుంబసభ్యులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కొన్ని సాధారణ పరీక్షల అనంతరం ఆమె సోమవారం రాత్రి సమయానికి హ్యూస్టన్‌లోని తన ఇంటికి చేరుకుంటారని నాసా సిబ్బంది చెప్పారు.
👩🚀 Astronaut Kate Rubins is all "high fives and smiles" as she takes her first breath of fresh Earth air in 185 days. Aboard the @Space_Station, Rubins conducted hundreds of hours of @ISS_Research, including advancing her work in DNA sequencing. pic.twitter.com/dAAq7Yx3WT
— NASA (@NASA) April 17, 2021
సెర్గీ రైజికోవ్, సెర్గీ కుడ్వర్చ్కోవ్ తో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన కేట్ రూబిన్స్.. వందల గంటలు అంతరిక్షంలో గడిపారు. అలాగే, రెండు స్పేస్ వాకింగ్లను కూడా పూర్తి చేశారు. నవంబర్ 30 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముల్లంగి పంటను పండించిన కేట్.. ఈ ప్రయోగానికి ప్లాంట్ హాబిటాట్-02 అని పేరు పెట్టారు.
ఈ నెల 21 న కేట్ రూబిన్స్ మీడియా సమావేశం నిర్వహించి తన అంతరిక్ష అనుభవాలను పంచుకోనున్నట్లు సమాచారం. ఈ సమావేశం హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి నాసా టెలివిజన్, నాసా యాప్, ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
నేపాల్‌లో వైభవంగా విషాల్ సింధూర్ జాతర
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్‌కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..