గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 29, 2020 , 13:32:32

నెయిల్‌పాలిష్ మీద జ‌వాబులు.. ప‌రీక్ష‌ల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు!

నెయిల్‌పాలిష్ మీద జ‌వాబులు.. ప‌రీక్ష‌ల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు!

ప‌రీక్ష‌లు అన‌గానే స్టూడెంట్స్‌కు గుండెల్లో ద‌డ‌. చ‌ద‌వ‌ని స్టూడెంట్స్‌కి ఎక్క‌డ ఫెయిల్ అవుతారో అని భ‌యం. చదివే స్టూడెంట్స్‌కు ఎక్క‌డ ఫ‌స్ట్ ర్యాంక్ రాదో అన్న భ‌యం. ఇలా చ‌దివేవాళ్లు, చ‌ద‌వ‌ని వాళ్లు మార్కుల కోసం చీటింగ్ కొట్టాల‌నే చూస్తుంటారు. అలా కాపీ కొడుతూ ఇన్‌విజిలేట‌ర్లుకు దొరికి డీబార్ అయిన స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు. అయితే కొంత‌మంది పేప‌ర్ల మీద జ‌వాబులు రాసుకొస్తే మ‌రికొంద‌రు మైక్రో జెరాక్స్ చేసిన పుస్త‌కంతో స‌హా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్లిపోతున్నారు. 

చిన్న స్లిప్పులు ఉంటే వాటిని కాల‌ర్‌, ప్యాంట్‌, షూల‌లో పెట్టుకెళ్తారు అనే విష‌యాలు కూడా తెలిసిన‌వే. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని విష‌యం ఏంటంటే.. నెయిల్‌పాలిష్ మీద కూడా జ‌వాబులు రాసుకోవ‌చ్చు. వీరి తెలివికి అక్కడ అధికారులంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. మెక్సికోలోని మిచౌక్యాన్ ప్రాంతంలో ఇటీవ‌ల టీచ‌ర్ల అడ్మిషన్ల కోసం ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. దీనికోసం మొత్తం 350 మంది ధరకాస్తుదారులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో 50 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి. మిగతా 300 మందికి 99 నుంచి 90 మార్కులు వచ్చాయి. ఈ స్థాయిలో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ రాలేదు. ప‌రీక్ష‌లు రాసిన వారంతా పాస్ అవ్వ‌డంతో అధికారుల‌కు అనుమానం వ‌చ్చింది. 

దీంతో వారు కొన్ని కార‌ణాల వ‌ల్ల మొద‌టిసారి రాసిన ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్నాం. మ‌ళ్లీ రాయాల‌ని ప్ర‌క‌టించారు. రెండోసారి ఆగ‌స్ట్ 21న నిర్వ‌హించారు. ఇందులో కాపీ కొడుతూ కొంత‌మంది అధికారుల‌కు దొరికిపోయారు. వారి గోర్ల‌ను ప‌రీక్షించి చూస్తే  ఆన్స‌ర్లు ఉన్నాయి. పేప‌ర్ ముందుగానే లీక్ అవ్వ‌డంతో ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌లోని డాట్స్‌లో ఫిల్ చేయాల్సిన చుక్కలను గోళ్ల మీద వేర్వేరు రంగుల్లో మార్క్ చేసుకున్నారు. ఒక్కో గోరు మీద ప‌ది డాట్స్ వ‌ర‌కు ఉన్నాయి. మొత్తం వంద మార్కుల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఆ ప‌ది గోర్ల మీద ఉన్నాయి. అయితే ఈ దొంగల‌కు ముందుగానే అనుమానం వ‌చ్చి చేతికి గ్ల‌వ్స్ వేసుకొని వ‌చ్చాయి. అయినా దొరికిపోయారు. logo