Israel | గాజా: ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా స్ట్రిప్‌పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు. 25 ఏండ్ల తర్వాత టైప్-2 పోలియో వైరస్ లక్షణాలు ఒక బాలుడిలో కన్పించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 6.40 లక్షల మందికి పోలియో టీకాలు వేయాలని నిర్ణయించింది.
తాత్కాలిక కాల్పుల విరమణలకు ఇజ్రాయెల్ దళాలు, హమాస్ అంగీకరించాయి. శనివారం 2 వేల మంది వైద్య సిబ్బంది వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 48 మంది మరణించారని తెలిసింది.