ది హేగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారంట్ జారీచేసింది. ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున చిన్న పిల్లలు అపహరణకు గురవుతున్నారని, ఇందులో పుతిన్ పాత్ర ఉన్నదని ఆరోపించింది. యుద్ధనేరాలకు పాల్పడినందుకు ఆయనపై అరెస్ట్ వారంట్ జారీచేసినట్టు తెలిపింది. ‘పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, అంతేగాకుండా ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను బలవంతంగా తరలించడం తదితర నేరాలకు పుతిన్ బాధ్యుడు’ అని ఐసీసీ పేర్కొన్నది. రష్యాలోని బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాకు కూడా వారంట్ జారీ చేసింది. దీనిపై రష్యా స్పందించింది. వారంట్ జారీచేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది.