ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో వెలుగుచూసిన మరో పేలుడు (Blast)లో ముగ్గురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుఖ్వ ప్రావిన్స్‌లోని హంగు జిల్లాలో ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. జుమా ప్రార్ధనల సమయంలో ఈ ఘటన జరిగిందని దవోబా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ షహ్రజ్ ఖాన్ తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో 30 నుంచి 30 మంది మసీదులో ఉన్నారని చెప్పారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నామని తెలిపారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు ధ్వంసమైందని హంగు జిల్లా పోలీస్ అధికారి నిసార్ అహ్మద్ వెల్లడించారు.
బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లాలో మదీనా మసీదు సమీపంలో జరిగిన భారీ పేలుడులో 52 మంది మరణించడం, 50 మందికి గాయాలైన ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాతే తాజా పేలుడు వెలుగుచూసింది. పేలుడు నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
Read More :
Nipah virus: నిపా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు.. శ్యాంపిల్ టెస్ట్‌లో నెగటివ్